ఏప్రిల్ నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వాల్సిందే...
కొణిజర్ల: కొణిజర్ల మండలం పెద్దగోపతి, చిన్నమునగాల, కాచారం గ్రామాల్లో పంటలను జల వనరుల శాఖ అఽధికారులు మంగళవారం పరిశీలించారు. ఎస్‌ఈ వాసంతి, ఈఈ బాబూరావు, డీఈ గౌతమి శిల్ప, ఏఈ నవీన్ పంటలు పరిశీలించగా పలువురు రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపల్లె మేజర్ కింద తమ పంటలు ఎండిపోతుంటే నీళ్లు ఇవ్వకుండా, దిగువ మండలాలకు తరలించేడమేమిటని నిలదీశారు. అంతేకాక అధికారులు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఈ వాసంతి స్పందిస్తూ ఎన్నెస్పీ నుంచి బోనకల్ బ్రాంచ్ కాల్వకు విడుదల చేసే నీటిని తగ్గించారని, ఆ దామాషా ప్రకారమే మేజర్లకు నీరు విడుదల చేస్తున్నామని బదులిచ్చారు. అయినా సాయంత్రం నుంచి ఐదు రోజుల పాటు నిరంతరాయంగా నీరు విడుదల చేస్తామని చెప్పగా, కనీసం ఇప్పుడు వారం పాటు ఇవ్వాలని, ఏప్రిల్ 15 వరకు కాకుండా నెలాఖరు వరకు విడుదల చేస్తేనే పంటలు చేతికి వస్తాయని రైతులు పేర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఈ తెలిపారు.
ఎన్నెస్పీ ఆయకట్టు రైతుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment