కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుత సమాజంలోనే కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ నేటికీ వివిధ రూపాల్లో కులవివక్ష కొనసాగుతుండగా, పలు పట్టణాల్లో ఇంకా దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు. వీటిని పారద్రోలేందుకు చట్టాలు, జీఓలు ఉన్నా పాలకవర్గాలు అమలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యాన ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా ప్రకటించి పూలే, అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రసాద్, నందిపాటి మనోహర్, నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్, బొట్ల సాగర్, కొమ్ము శ్రీను, నకిరేకంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
స్కైలాబ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment