కమ్యూనిస్టు యోధుడు, పోరాట సారథి రవన్న
ఖమ్మంమయూరిసెంటర్: విప్లవ కమ్యూనిస్టు యోధుడు, ప్రతిఘటన పోరాట సారధి రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అని, ఆయన ఆశయాల సాధన కోసం అందరూ ఉద్యమించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏపీ, తెలంగాణ అధికార ప్రతినిధులు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్‌డీ ఆధ్వర్యాన రవన్న తొమ్మిది వర్ధంతి సభ సందర్భంగా మంగళవారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించాక భక్తరామదాసు కళాక్షేత్రంలో సమావేశమయ్యారు. తొలుత ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక నాయకులు మాట్లాడారు. విద్యార్థిగా ఉన్నప్పుడే విప్లవోద్యమానికి ఆకర్షితుడైన ఆయన ప్రతిఘటన పోరాట పంథా అమలు చేశాడని తెలిపారు. రవన్న ఆయన ఆశయ సాధనకు ఉద్యమిస్తూనే పాలకుల విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆవునూరి మధు, వి.కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్, గౌని ఐలయ్య, బండార ఐలయ్య, ఝాన్సీ, మంగ, అరుణోదయ నాగన్న, డేవిడ్ కుమార్, రాజేంద్రప్రసాద్, కోలా లక్ష్మీనారాయణ, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ధంతి సభలో పీపీ, సాధినేని
Comments
Please login to add a commentAdd a comment