మధిర: వైద్యం కోసం ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిన ఘటన మహదేవపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామారావు వైద్య చికిత్స కోసం కుటుంబసభ్యులతో కలిసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడే కొద్ది రోజులు ఉండి తిరిగి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఈలోగా గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. రూ.30 వేల విలువైన నగలు చోరీకి గురయ్యాయని బాధితుడు మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment