ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెం గ్రామానికి చెందిన బండారి నాగరాజు(40) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం కనిపించలేదు. దీంతో మనో వేదనకు గురైన నాగరాజు శనివారం చేనుకు వెళ్లి అక్కడే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఉపేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
కుటుంబ కలహాలతో ఆర్‌ఎంపీ..
పెనుబల్లి: మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పద్దం నర్సింహారావు(31) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో కొంతకాలంగా కలహాలు తీవ్రం కావడంతో నర్సింహారావు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం రామచంద్ర బంజర గ్రామ శివారు నాయకుల గూడెం రోడ్డు వద్ద గడ్డిమందు తాగి పడుకున్నాడు. అటుగా వెళ్లేవారు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. నర్సింహారావు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment