ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
సత్తుపల్లిరూరల్: సింగరేణి గనుల నుంచి బొగ్గు తరలింపునకు సత్తుపల్లి మండలంలో ఏర్పాటుచేసిన సైలోబంకర్ ద్వారా వెలువడే కాలుష్యంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు చలమల విఠల్ అన్నారు. సైలో బంకర్‌ను తొలగించాలని కిష్టారం అంబేద్కర్‌నగర్, బీసీ కాలనీ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 22వ రోజుకు చేరగా వారు మాట్లాడారు. బంకర్ తొలగించే వరకు దీక్షలు ఆపొద్దని, బాదితులకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాజిరి శ్రీనివాస్, గుడిమెట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు 600 మందితో పాదయాత్ర
సైలోబంకర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో 22వ రోజులుగా దీక్షలు చేపడుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం 600 మంది కిష్టారం నుంచి సత్తుపల్లి వరకు కాలినడకన వెళ్లి అక్కడ తహసీల్‌లో వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.
సైలో బంకర్ బాధితుల దీక్షలో నాయకులు
Comments
Please login to add a commentAdd a comment