మార్కెట్‌కు లక్ష బస్తాల మిర్చి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు సోమవారం భారీగా మిర్చి తీసుకొచ్చారు. మహాశివరాత్రి, అమావాస్య, వారాంతపు సెలవుల అనంతరం మార్కెట్‌లో క్రయవిక్రయాలు మొదలుకాగా దాదాపు లక్ష బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్, నల్ల గొండ, కరీంనగర్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా రైతులు మిర్చి తీసుకొచ్చారు. గతనెల 24 సోమవారం 1.20 లక్షల మిర్చి బస్తాల రాగా, సోమవారం కూడా లక్ష బస్తాల మేర తీసుకురావడంతో మార్కెట్‌లోని యార్డులు, షెడ్లు నిండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment