వేంసూరు: మండలంలోని చౌడవరంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన దుండగులు రూ.8వేల విలువైన కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని అల్లు లక్ష్మీ నరసింహరెడ్డి ఆయిల్‌పామ్ తోటలో ఈ ఘటన జరిగింది. ఈమేరకు విద్యుత్ శాఖ ఏఈ అంకురావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వరిగడ్డి వామి దగ్ధం
ముదిగొండ: మండలంలోని సువర్ణాపురంలో మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దేవేంద్రంకు చెందిన వరిగడ్డి వామికి సోమవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే, అప్పటికే రూ.70వేల విలువైన 500 దిండ్లు కాలిపోయాయని దేవేంద్రం వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment