ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో రజతం
ఖమ్మం స్పోర్ట్స్: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఉషూ టోర్నీలో ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి రజత పతకం గెలుచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్‌టీయూలో చదువుతున్న ఆమె చండీఘర్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఉషూ పోటీల్లో నాన్‌దావో ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరింది. ఆతర్వాత హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో పవిత్రాచారికి ద్వితీయస్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి పతకం దక్కించుకున్న క్రీడాకారిణి ఒక్కరే కావడం విశేషం. ఈసందర్భంగా ఆమెను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు.
విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి..
కొణిజర్ల: విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రఽతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని జీవశాస్త్ర విభాగం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా బయాలజీ ఉపాధ్యాయులకు సోమవారం కొణిజర్ల సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓరి యంటేషన్ నిర్వహించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పా ఠశాలల బయాలజీ ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సమావేశంలో ఖమ్మం, వైరా సహాయ సంక్షేమ అధికారులు సత్యవతి, జహీరుద్దీన్‌తో కలిసి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి శ్రద్ధ కనబరిస్తే అందరి తో పాటే మంచి మార్కులు సాధించే అవకాశముంటుందని తెలిపారు.
ఎంపీడీఓ కార్యాలయంలో న్యాయమూర్తి
కూసుమంచి: మధిర అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి టి.కార్తీక్‌రెడ్డి సోమవారం కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. శిక్షణలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన ‘పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన’ అంశంపై ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డితో చర్చించారు. కాగా, మంగళ, బుధవారాల్లో ఆయన ఖమ్మం రూరల్ తహసీల్‌తో పాటు ఖమ్మం ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలను సందర్శించనున్నారు.
9న రవన్న వర్ధంతి సభ
ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయనే నినాదంతో, మైదాన ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసిన రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 9న రవన్న తొమ్మిదో వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సభలో రవన్న సాగించిన ఉద్యమాలపై సెమినార్ ఉంటుందన్నారు. ఈమేరకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రవన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుర్రం అచ్చయ్య, కార్యదర్శి పుసులూరి నరేందర్ మాట్లాడగా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్, ఏ.వెంకన్న, బందెల వెంకయ్య, మలీదు నాగేశ్వరరావు టి.ఝాన్సీ, కె.శ్రీనివాస్, ఎన్ ఆజాద్ పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో..
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన ప్రతిఘటన పోరాట యోధుడు రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) వర్ధంతిని ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు, గౌని ఐలయ్య తెలిపారు. ఖమ్మంలో సోమవారం వారు మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన ప్రజానీకం సమస్యలపై పోరాడిన వ్యక్తి రవన్న అని పేర్కొన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే ఆయన వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, నాయకులు బండారి ఐలయ్య, అరుణోదయ నాగన్న, డేవిడ్ కుమార్ పాల్గొన్నారు.
రూ.2.48 కోట్లకు ఐపీ
ఖమ్మం లీగల్: ఖమ్మంకు చెందిన కొదుమూరు శ్రీనివాసరావు రూ. 2,48,80,000కు సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులో సోమవారం దివాళా పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. బియ్యం వ్యాపారం చేసిన ఆయన పలువురి వద్ద అప్పులు చేశాడు. ప్రస్తుతం అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ 64మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాదులు కోనా చంద్రశేఖర్‌గుప్తా, పి.శరణ్య, పి.సాయికిరణ్ ద్వారా కోర్టులో దివాళా పిటీషన్ దాఖలు చేశాడు.
ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో రజతం
Comments
Please login to add a commentAdd a comment