హీటర్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

హీటర్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతి

Published Tue, Mar 4 2025 12:33 AM | Last Updated on Tue, Mar 4 2025 12:30 AM

హీటర్

హీటర్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతి

ఖమ్మంరూరల్‌: మండలంలోని వెంకటగిరి పరిధి ఇందిరమ్మ కాలనీ ఫేజ్‌–2కు చెందిన బండారి వెంకటేశ్వర్లు(54) విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందాడు. ఆయన ఉదయం ఇంట్లో వాటర్‌ హీటర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే కన్నుమూశాడు. ఆ సమయాన ఇంట్లో ఎవరూ లేకపోగా, ఖమ్మం వెళ్లిన వారు వచ్చేసరికి కిచెన్‌ రూంలో విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

గుండెపోటుతో జమలాపురం ఆలయ అర్చకుడు...

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ అర్చకులు ఉప్పల సుదర్శన్‌శాస్త్రి(59) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. నిత్యపూజల్లో కీలకంగా వ్యవహరించే ఆయన మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఈమేరకు సుదర్శన్‌శాస్త్రి మృతదేహం వద్ద ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ విజయకుమారి తదితరులు నివాళులర్పించారు.

రోడ్డు ప్రమాదంలో కూలీ...

పెనుబల్లి: మండలంలోని ఎడ్ల బంజర్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రోజువారీ కూలీ ఇమ్మడి భాస్కర్‌(55) మృతి చెందాడు. రహదారిపై నడిచి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుండి వీఎం బంజర వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ను స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలికి వీఎం బంజర పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

సత్తుపల్లిటౌన్‌: ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన బేతిని సత్యం(55) ఈనెల 1వ తేదీన తన ఇంటి ఆవరణలోని చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో ఆయన వెన్నుపూస, చేతికి బలమైన గాయాలయ్యాయి. ఈమేరకు స్థానికంగా చికిత్స అనంతరం హైదరాబాద్‌ తరలించగా పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హీటర్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతి
1
1/1

హీటర్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement