ఆవిష్కరణలతోనే ముందడుగు
ఖమ్మం సహకారనగర్: కొత్త ఆవిష్కరణలతోనే సైన్స్ రంగంలో అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఈవిషయంలో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ అకాడమీ సైన్సెస్ అధ్యక్షుడు, సీసీఎండీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.మోహన్‌రావు తెలిపారు. ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన సైన్స్ డే సమావేశంలో ఆయన మాట్లాడారు. దైనందిన జీవితంలో సైన్స్‌కు ప్రాముఖ్యత పెరిగిందని.. ఎందరో శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో మానవాళికి మేలు చేశారని తెలిపారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ వరంగల్ జోన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, ఎన్‌ఆర్‌ఆర్ మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.సాంబశివరావు మాట్లాడగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎం.నిరంజన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వీ.రమణా రావు, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.ఆంజనేయులు, ఐక్యూఎస్ కోఆర్డినేటర్ అజయ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ఎర్రుపాలెం: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కోగంటి సాయిరాం(29) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై సాయిరాం తల్లి రమాదేవి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకటేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment