చింతకాని: చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. రైలు సోమవారం మధ్యాహ్నం విజయవాడ దాటాక ఖమ్మం మార్గంలో వెళ్తుండగా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే గేట్ వద్ద ట్రాక్‌పైకి ట్రాక్టర్ వచ్చింది. ఈ మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా గేట్ వేయలేదు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ వచ్చినట్లు తెలుస్తుండగా, గమనించిన లోకో పైలట్ బ్రేకులు వేసి వేగాన్ని నియంత్రించాడు. ఈమేరకు గేటు వద్దకు రైలు వచ్చేసరికి ట్రాక్‌పై ఉన్న ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై లోకో పైలట్ ఖమ్మం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment