
కొత్త బస్టాండ్ ఫుడ్‌కోర్టులో ఇడ్లీల్లో పురుగులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని ఫుడ్ కోర్టులో టిఫిన్ చేసేందుకు వచ్చిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మధ్యాహ్నం దేవేందర్ ఫుడ్‌కోర్టుకు వెళ్లి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఆయన ఇడ్లీ తింటుండగా అందులో పురుగు రావడంతో ఇదేమిటని ప్రశ్నించినా నిర్వాహకుల నుంచి స్పందన లేక జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.కిరణ్‌కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, కొత్త బస్టాండ్‌లోని హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత పాటించడం లేదని బస్టాండ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయమై ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా ఓ వ్యక్తి ఫోన్‌లో ఫిర్యాదు చేశాడని, అందుబాటులో లేనందున త్వరలోనే తనిఖీ చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment