
●బౌద్ధక్షేత్రం సందర్శన
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని బౌద్ధ భిక్షువులైన సద్ధా రక్కితా, బిక్షు ప్రజ్ఞానంద మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహాబోధి, మహావిహార నిర్వహణను పూర్తిగా బౌద్ధ బిక్షువులతో కూడిన కమిటీకి అప్పగించాలని కోరారు. కాగా, క్షేత్రంలో బ్రాహ్మణ పూజారులతో జరిగే పూజాక్రతువులు నిషేదించాలనే అభ్యర్ధనలు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు ప్రాచీన కట్టడాలను పరిరక్షించి ఆధ్మాతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే కాక స్థానిక ఉపాకులను నిర్వహణలో భాగస్వామ్యులుగా చేయాలని కోరారు. బౌద్ధ ఉపాసకులు వంగూరి ఆనందరావు, వెంకట్, ఈదయ్య, వెంకన్న, కె.వెంకటేశ్వర్లు, తోళ్ల సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment