
ప్రమాదవశాత్తు వ్యాన్ దగ్ధం
ఏన్కూరు: ఏసీలు, రిఫ్రిజిరేటర్లను తీసుకెళ్తున్న వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. ఖమ్మంకు చెందిన రమేష్ తన మినీ వ్యాన్‌లో 9ఏసీలు, 12 రిఫ్రిజిరేటర్లను మంగళవారం కొత్తగూడెం తీసుకెళ్తున్నాడు. ఏన్కూరు మండలం కోనాయపాలెం సమీపాన ఒక్కసారిగా వ్యాన్‌కు మంటలు చెలరేగడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. ఈమేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా, ఏసీలు, ఫ్రిజ్‌లకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు పేలడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment