ఖమ్మంవైద్యవిభాగం: గ్రామస్థాయిలో గర్భిణులు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏఎన్‌ఎంలపై ఉందని డీఎంహెచఓ కళావతిబాయి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ‘ఆర్మన్’ సంస్థ సహకారంతో ‘అమ్మ కోసం’ పేరిట ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గర్భధారణ మొదలు ప్రసవం వరకు మహిళలు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే మాతృమరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, ఆర్మన్ ఆర్గనైజేషన్‌కు చెందిన డాక్టర్ అఖిల పలు అంశాలను వివరించగా టీఓటీలు డాక్టర్ స్రవంతి, డాక్టర్ చందన, డీపీహెచ్‌ఎన్‌ఓ ఎస్.శేషుపద్మ, డీసీఎం ఎన్.రఘురాం, డీపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment