
అధ్యాపకురాలికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకురాలు కె.విజయలక్ష్మికి డాక్టరేట్ లభించింది. కై కలూరులోని వైవీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె.పంకజ్ కుమార్ పర్యవేక్షణలో ఆమె ‘ఎక్స్ పేట్రియట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఝంపాల హరీస్ ఫిక్షన్ – ఏ క్రిటికల్ స్టడీ’ అంశంపై పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంధం సమర్పించగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా విజయలక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా, వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ బానోత్‌రెడ్డి, అధ్యాపకులు ఏ.నర్సమ్మ, రాంబాబు, బంగారి, కె.రవికుమార్ తదిరులు అభినందించారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈనెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిలా ఉపాధి కల్పన శాఖా ధికారి ఎన్.మాధవి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వైఎస్‌కే ఇన్ఫోటెక్, జీజే సొల్యూషన్స్ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలకు ఆయా సంస్థల బాధ్యులు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు 18–30 ఏళ్ల వయస్సు కలిగి ఎస్సెస్సీ మొదలు డిగ్రీ అర్హత ఉన్న వారు హాజరుకావొచ్చని తెలిపారు.
పీఎం ఇంటర్న్‌షిప్‌నకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంవన్‌టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా శిక్షణ కోసం ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి టి.సీతారాం సూచించారు. ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు 12నెలల వ్యవధిలో కనీసం ఆరు నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని, నెలవారీ రూ.5వేల భత్యం అందుతుందని తెలిపారు. 21 – 24 ఏళ్ల వయస్సు కలిగి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా, గత ఏడాది వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు pmintership. mca.gov.in ద్వారా గరిష్టంగా ఐదు ఇంటర్న్‌షిప్ ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 1800116090 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
వకుళామాత స్టేడియంలో యాగం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శ్రీవకుళామాత స్టేడియంను ఈనెల 7వ తేదీన ప్రారంభించనున్నారు. గ్రామానికి చెందిన తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల దంపతుల ఆర్థిక చేయూతతో నిర్మించిన ఈ స్టేడియం ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం దాత దంపతులతో అర్చకులు యాగం జరిపించారు. గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, భూశుద్ధి, అఖండ దీపారాధన, మండపస్థాపన కార్యక్రమాలు జరగగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కట్లేరు ప్రాజెక్టులోకి
సాగర్ జలాలు
ఎర్రుపాలెం: మండలంలోని కట్లేరు ప్రాజెక్టు ఆయకట్టులో పంటలకు ఇబ్బంది ఎదురుకాకుండా మంగళవారం సాగర్ జలాలను విడుదల చేశారు. పంటలకు నీరందక ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు పెనుబల్లి మండలం కొండ్రుపాడు ఎస్కేప్(88 కి.మీ.) వద్ద ఎన్‌ఎస్‌పీ మెయిన్ కెనాల్ నుంచి సాగర్ జలాలను కట్లేరుకు విడుదల చేశారు. ఈసందర్భంగా మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు తదితరులు కట్లేరును పరిశీలించారు.

అధ్యాపకురాలికి డాక్టరేట్

అధ్యాపకురాలికి డాక్టరేట్
Comments
Please login to add a commentAdd a comment