వెంకట్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం
కామేపల్లి: మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కామేపల్లిలోని కొత్తలింగాల క్రాస్‌లోని వెంకట్‌రెడ్డి విగ్రహం వద్ద ఆయన 9వ వర్ధంతి సందర్భంగా మంగళవారం వారు నివాళులర్పించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు వెంకటరెడ్డి అండగా నిలిచి, వారి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఇదే సమయాన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ కార్యకర్తలను కాపాడుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, శ్రీచరణ్‌రెడ్డి, జగన్నాథరెడ్డి, మానుకొండ రాధాకిషోర్, గింజల నరసింహారెడ్డి, దమ్మలపాటి సత్యనారాయణ, మద్దినేని రమేశ్‌బాబు, నర్సింహారావు, ధనియాకుల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment