ధర, దిగుబడి ఇచ్చే వంగడాలపై దృష్టి
ఖమ్మంవ్యవసాయం: అధిక దిగుబడితో పాటు మార్కెట్‌లో మంచి ధర లభించే వంగడాల రూపకల్పనపై దృష్టి సారించామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి తెలిపారు. చైర్మన్, అధికారుల బృందం జిల్లాలోని పలుప్రాంతాల్లో సాగవుతున్న పెసర తదితర పంటలను పరిశీలించారు. ఆతర్వాత ఖమ్మంలోని సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది వానాకాలం సీజన్‌కు విత్తనాల లభ్యతపై ఆరాతీసిన చైర్మన్ మాట్లాడుతూ ప్రాంతాల వారీగా నేల రకాల ఆధారంగా విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. అధిక దిగుబడి, ధర దక్కేలా వంగడాలను రైతులకు సమకూరుస్తామని చెప్పారు. తొలుత రఘునాథపాలెం మండలం గణేశ్వరం శివారులో ఉన్న పెసర చేలను చైర్మన్ అన్వేష్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. ఈ బృందంలో విత్తనాభివృద్ధి సంస్థ ప్రొడక్షన్, మార్కెటింగ్ మేనేజర్లు సంధ్యారాణి, రాజీవ్‌కుమార్, ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ బిక్షం, విత్తన అధికారి తేజశ్రీ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment