ఇక సాఫీగా పరిష్కారం
● అమల్లోకి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీ ● ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు మెసేజ్ ● జిల్లాలో 99,745 దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: ఎల్‌ఆర్‌ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారం ఇకపై సాఫీగా, వేగంగా జరగనుంది. ప్రభుత్వం గత నెల 19న ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో జిల్లాలో అమలు కాలేదు. ప్రస్తుతం ఎన్నికల ఫలితం వెలువడడంతో జిల్లాలోనూ రాయితీ అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సోమవారం రాత్రి నుంచే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు 25శాతం రాయితీతో ఫీజు చెల్లించాలని మెస్సేజ్‌లు వస్తున్నాయి. వెబ్‌సైట్‌లో దరఖాస్తు నంబర్ ఆధారంగా పరిశీలిస్తే ఎంత ఫీజు చెల్లించాలో చూపిస్తుండడంతో మంగళవారం ఉదయమే పలువురు కేఎంసీతో పాటు ఇతర మున్సిపల్ కార్యాలయాలకు చేరుకుని ఆరా తీయడం కనిపించింది.
భారీగా దరఖాస్తులు
ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో 51,425 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 8,851 అనుమతి పొందగా.. 339 దరఖాస్తులను తిరస్కరించారు. గతంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి 53 ఉండగా, సరైన డాక్యుమెంట్లు లేక 2,035 దరఖాస్తులు పెండింగ్ పెట్టారు. అలాగే, నిషేధిత సర్వేనంబర్ల జాబితాలో 5,946 ప్లాట్లకు సంబంధించి దరఖాస్తులు అందాయని గుర్తించారు. కాగా, దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతుండగా ఎల్–1 దశలో 33,302, ఎల్–2లో 259, ఎల్–3 దశకు 51 చేరాయి. మొత్తంగా ఫీజు చెల్లించడం కోసం 8,916 దరఖాస్తులకు అనుమతి ఇవ్వగా 1,151 దరఖాస్తులకే యజమానులు ఫీజు చెల్లించారు. ఇంకా 7,765 దరఖాస్తులకు ఫీజు పెండింగ్ ఉంది.
వాటిని పక్కకు పెట్టి..
ఎల్‌ఆర్‌ఎస్ కోసం కేఎంసీ తర్వాత అత్యధిక దరఖాస్తులు ‘సుడా’ పరిధిలో అందాయి. అయితే, ఎల్–1 దశలో పరిశీలన అధికారులకు భారంగా మారగా, ప్రభుత్వం ఫీజు రాయితీ ఈనెల 31వ తేదీ వరకే వర్తిస్తుందని చెప్పడంతో ఆలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి కాదని తెలుస్తోంది. దీంతో నిషేధిత, ప్రభుత్వ, ఇరిగేషన్ స్థలాల్లో ఉన్న లేఔట్లు, స్థలాలను పక్కన పెట్టి అన్నీ సక్రమంగా ఉన్న ప్రైవేటు స్థలాలకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేలా అవకాశం కల్పించనున్నారు. కాగా, ఫీజు చెల్లించిన దరఖాస్తుల్లోనూ ఏమైనా సమస్యలు గుర్తిస్తే వాటిని తిరస్కరించే అవకాశముందని అధికారులు ముందుగానే చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగితే ప్రాసెస్ ఫీజు మినహా మిగిలిన మొత్తం చెల్లిస్తామని వివరిస్తున్నారు.
మరింత అ‘ధనం’..
దరఖాస్తుదారులకే సమాచారం..
ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ విషయంలో దరఖాస్తుదారులకు నేరుగా మెసేజ్ వెళ్తోంది. అలా అందిన వారు ఫీజు చెల్లిస్తే దరఖాస్తులు పరిశీలించి రెండు, మూడు రోజుల్లో రెగ్యులరైజ్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ
ఎల్‌ఆర్‌ఎస్ కోసం అందిన దరఖాస్తులు
మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు ఫీజు చెల్లించినవి
అనుమతి పొందినవి
ఖమ్మం కార్పొరేషన్ 39,945 3,735 939
మధిర 4,276 1,488 97
సత్తుపల్లి 3,688 2,391 62
వైరా 3,516 1,237 48
సుడా 34,393 07 04
గ్రామపంచాయతీలు 13,927 58 01
మొత్తం 99,745 8,916 1,151
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం మెసేజ్ పంపిస్తోంది. ఫీజు చెల్లించాక వివరాలను అధికారులకు అందజేస్తే స్థలాలను పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు. దీంతో దరఖాస్తుదారులు మంగళవారం కేఎంసీ, సుడా, ఇతర మున్సిపాలిటీలకు క్యూ కట్టారు. అసలు ఫీజు, రాయితీ పోగా ఎంత కట్టాలని ఆరా తీస్తుండగా.. కొందరు రాయితీ తీసేస్తే ఇంకా ఫీజు పెరుగుతోందని మొర పెట్టుకోవడం కనిపించింది. ఆన్‌లైన్‌లో లేకున్నా అదనంగా రూ.10 వేలు చెల్లించాల్సి వస్తున్న అంశాన్ని ఉన్నతాధికారులు స్థానిక అధికారులు నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఖాళీ స్థల ట్యాక్స్‌ను కూడా ఫీజులో పొందుపర్చడంతో ఇలా జరిగిందని సమాచారం.
ఇక సాఫీగా పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment