మంటలు ఆర్పేది ఎలా? | - | Sakshi
Sakshi News home page

మంటలు ఆర్పేది ఎలా?

Published Thu, Mar 6 2025 12:29 AM | Last Updated on Thu, Mar 6 2025 12:33 AM

మంటలు

మంటలు ఆర్పేది ఎలా?

ఖమ్మంక్రైం: జిల్లాలో అగ్నిమాపక శాఖను కీలకమైన ఫైర్‌మెన్ల కొరత వేధిస్తోంది. గత నెలాఖరు నుంచే ఎండ తీవ్రత మొదలుకాగా ఈనెలలో మరింత పెరిగింది. ఇక ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ గరిష్టస్థాయిలో నమోదయ్యే అవకాశమున్నందున ఇదే స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశముంది. దీంతో సిబ్బంది కొరత కారణంగా శాఖ ఉద్యోగులు కలవరపడుతున్నారు. జిల్లాలో ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కూసుమంచిల్లో ఫైర్‌ స్టేషన్లు ఉండగా నేలకొండపల్లిలో ఔట్‌ పోస్ట్‌ కొనసాగుతోంది.

ఐదు స్టేషన్లకు ముగ్గురే ఆఫీసర్లు

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఘటనాస్థలికి వెళ్లి మంటలు ఆర్చడంలో ఫైర్‌మెన్‌లే ముఖ్యపాత్ర పోషిస్తారు. ఏ స్థాయిలో మంటలు ఉన్నా మంటలు ఆర్పడంలో శిక్షణ తీసుకుని ఉండడంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతారు. అలాంటి ఫైర్‌ మెన్ల కొరత జిల్లా అగ్నిమాపక శాఖను వేధిస్తోంది. జిలాల్లో ఐదు స్టేషన్లకు ముగ్గురు ఫైర్‌ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో కీలకమైన ఖమ్మం స్టేషన్‌కు ఫైర్‌ అధికారి లేకపోవడంతో మధిర ఫైర్‌ అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కూసుమంచి ఫైర్‌ అధికారి ఇటీవల సస్పెండ్‌ కాగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇక లీడింగ్‌ ఫైర్‌మెన్లు 10మంది, డ్రైవర్లు 16, ఫైర్‌మెన్లు 32, హోంగార్డులు 21మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా 16 ఫైర్‌మెన్లు, ఒక డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రమాదాల్లో అగ్రగామి

జిల్లాలో గడ్డివాములు కాలిపోయినట్లు మరెక్కడా జరగవని.. రాష్ట్రంలోనే ఈ ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు త్వరగా మంటలు వ్యాపిస్తాయి. మంటలు అంటుకున్న గడ్డివాముతో పాటు సమీపంలోని వాములు, గుడిసెలు తగలబడే ప్రమాదముంది. ఈనేపథ్యాన సుశిక్షితులైన సిబ్బంది వీలైనంత త్వరగా చేరుకుని మంటలు ఆర్పితేనే నష్టతీవ్రత తగ్గడానికి ఆస్కారముంటుంది.

ఇంకో యూనిట్‌ లేదా స్టేషన్‌

జిల్లాలోని ఖమ్మం రూరల్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఖమ్మం నుంచే వాహనంతో సిబ్బంది వెళ్లాల్సి వస్తుంది. అయితే, ఒకేసారి రెండు చోట్ల ప్రమాదాలు జరిగితే చేసేదేం ఉండడం లేదు. దీంతో ఖమ్మంలో ప్రస్తుత ఉన్న యూనిట్‌కు అదనంగా కొత్త మంజూరు చేయాలని లేదంటే రూరల్‌ ప్రాంతంలో మరో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. సింగిల్‌ యూనిట్‌గా ఉన్న ఖమ్మం ఫైర్‌ స్టేషన్‌కు డబుల్‌ యూనిట్‌ మంజూరైతే సిబ్బంది పెరగడంతో పాటు ఇద్దరు ఫైర్‌ ఆఫీసర్లు ఉంటారు. అలాగే, అదనపు ఫైర్‌ ఇంజన్‌ వస్తుంది. ఇది సాధ్యం కాని పక్షంలో ఖమ్మం రూరల్‌ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు.

అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ల కొరత

ఎండలతో పాటే పెరుగుతున్న అగ్నిప్రమాదాలు

డబుల్‌ యూనిట్‌ లేదా రూరల్‌లో

కొత్త కేంద్రానికి ప్రతిపాదన

అగ్నిప్రమాదాల సమాచారం ఇవ్వాల్సిన నంబర్లు

స్టేషన్‌ నంబర్‌ ఫైర్‌ అధికారి

ఖమ్మం 87126 99280 87126 99281

వైరా 87126 99288 87126 99288

కూసుమంచి 87126 99286 87126 99287

మధిర 87126 99284 87126 99285

సత్తుపల్లి 87126 99282 87126 99283

నేలకొండపల్లి 87126 99290 87126 99291

డీఎఫ్‌ఓ 87126 99147

కంట్రోల్‌ రూమ్‌ 87126 99444,

87126 99464,

99499 91101

ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 101

ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి...

ఖమ్మం అగ్నిమాపక కేంద్రాన్ని డబుల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ చేయడం లేదా ఖమ్మం రూరల్‌ ప్రాంతంలో మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రతిపాదనలకు ఉన్నతాధికారులకు పంపించనుండగా, అనుమతి లభించగానే ఇతర ఏర్పాట్లు జరుగుతాయి. డబుల్‌ యూనిట్‌ మంజూరైతే వ్యవసాయ మార్కెట్‌లో అగ్నిమాపక కేంద్రం ప్రత్యేకంగా ఉంటుంది.

– బి.అజయ్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
మంటలు ఆర్పేది ఎలా?1
1/3

మంటలు ఆర్పేది ఎలా?

మంటలు ఆర్పేది ఎలా?2
2/3

మంటలు ఆర్పేది ఎలా?

మంటలు ఆర్పేది ఎలా?3
3/3

మంటలు ఆర్పేది ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement