
ప్రజారోగ్య కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరపాలక సంస్థకు చెందిన ప్రజారోగ్య కార్యకర్త బుధవారం కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. కేఎంసీలోని పలువురు సిబ్బంది విభాగాలు మారుస్తూ కమిషనర్ అభిషేక్ అగస్త్య నెల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొందరు రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ఉద్యోగి అయిన ప్రజారోగ్య కార్యకర్త మాధవి సైతం నూతన విభాగంలో రిపోర్టు చేయలేదు. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశాక, వారం క్రితం సస్పెండ్ చేశారు. ఈమేరకు మాధవి బుధవారం కమిషనర్‌ను కలిసేందుకు రాగా ఆయన అటవీశాఖ ఉన్నతాదికారులతో సమావేశంలో ఉన్నారు. దీంతో లోపలికి వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించగా తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను మింగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా మాధవి బంధువులు మాట్లాడుతూ కొందరు ఉద్యోగులు కక్షపూరితంగా ఆమెను సస్పెండ్ చేయించారని, షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇచ్చినా పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ఈ విషయమై కమిషనర్ అభిషేక్ అగస్త్యను షోకాజ్ నోటీస్‌కు స్పందించకపోవడం, కేటాయించిన విభాగంలో విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే, విధుల్లో చేరని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించామని, బదిలీ ఉద్యోగులను రిలీవ్ చేయని అధికారులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేఎంసీ కమిషనర్ చాంబర్ ఎదుట ఘటన
Comments
Please login to add a commentAdd a comment