
రైతులకు సేవలందించేందుకే ‘పొలం బాట’
రఘునాథపాలెం: రైతులకు సాగులో ఇబ్బందులు ఎదురుకాకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు తమ శాఖ ఉద్యోగులు ‘పొలం బాట’ క్షేత్రాలను సందర్శిస్తున్నారని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి తెలిపారు. రఘునాథపాలం మండలం రాములు తండా, మంచుకొండల్లో బవ్ధవారం నిర్వహించనిపొలంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 309 కార్యక్రమాలు జరగగా, 476 వంగిన స్తంభాలు, 590 లూజ్ లైన్లను సరిచేసి, 115 ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచామని, అవసరమైన చోట 747 స్తంభాలు ఏర్పాటుచేశామని తెలిపారు. అలాగే, మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ఆటో స్టార్టర్లు తొలగించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్‌సీ సూచించారు. డీఈ రామారావు, ఏడీ సంజయ్‌కుమార్, ఏఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
లింక్ లైన్ ప్రారంభం
కామేపల్లి: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎదురుకాకుండా చర్యలు చేసడుతున్నామని ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. ముచ్చర్ల సబ్‌స్టేషన్ నుంచి కామేపల్లి సబ్ స్టేషన్‌కు ఏర్పాటుచేసిన ప్రత్యేక లింక్ లైన్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. డీఈలు రామారావు, హీరాలాల్, వై.వీ.ఆనంద్‌కుమార్,కల్యాణ చక్రవర్తి, ఏఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment