
ఆర్టీసీ రాజధాని బస్సు బోల్తా
కొణిజర్ల: ఆర్టీసీ రాజధాని బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి బుధవారం తెల్లవారుజామున బస్సు వెళ్తుండగా కొణిజర్ల మండలం తనికెళ్ల బ్రౌన్స్ కళాశాల వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు పక్కకు ఒరిగి పల్టీ కొట్టడంతో పాటు రోడ్డు పక్కనే చెట్టుకు తట్టుకుని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయాన బస్సులో డ్రైవర్‌తో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన బీరెల్లి రాణి, పెనుబల్లి మండలం భువనపాలెంకు చెందిన దంపతులు వై.సత్యనారాయణ, సత్యవతికి గాయాలు కాగా ఖమ్మం తరలించారు. ఆర్టీసీ అధికారులు చేరుకుని క్రేన్ సాయంతో బస్సును తీయించగా, కొణిజర్ల ఎస్‌ఐ సూరజ్ కేసు నమోదు చేశారు. కాగా, బస్సు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఫోన్‌లో ఆదేశించారు.
ముగ్గురు ప్రయాణికులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment