
పూణె వెళ్లిన కేఎంసీ కార్పొరేటర్లు, అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలోనే స్మార్ట్ శానిటేషన్ సిటీగా పేరున్న పూణెలో అధ్యయనం కోసం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, అధికారులు మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన బుధవారం వెళ్లారు. కేఎంసీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరగా, అక్కడి నుంచి విమానంలో వెళ్లి సాయంత్రానికి పూణె చేరుకున్నారు. ఈసందర్భంగా పూణెలో వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి తది తర అంశాలపై అధ్యయనం చేసి అధికారులతో చర్చి స్తారు. ఖమ్మంలోనూ అక్కడి మాదిరిగా నిర్వహణకు ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనం
Comments
Please login to add a commentAdd a comment