
అందరి కృషితోనే విజయం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తరఫున బరిలోకి దిగిన పింగళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించడం హర్షణీయమని సంఘం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్‌టీయూ బాధ్యుల అలుపెరగని కృషితో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే ఖమ్మంలో శ్రీపాల్‌రెడ్డి అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు మోత్కూరి మధుతో పాటు వెంకటనర్సయ్య, కొండలరావు, లక్ష్మణరావు, శ్రీనివాస్, రవీంద్ర, గుడిపుడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment