ఖమ్మంఅర్బన్: వరదలు, అగ్నిప్రమాదాలు తదితర విపత్తుల సమయాన సాయం చేసేందుకు గాను ఎంపిక చేసిన ఆపదమిత్ర వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన శిక్షణలో డీఆర్‌డీఓ సన్యాసయ్య మాట్లాడుతూ విపత్తుల సమయాన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అండగా నిలచేలా ‘ఆపదమిత్ర’ల పేరిట వలంటీర్లను ఎంపిక చేశామని తెలిపారు. వీరికి అటవీ, పొలీస్, ఫిషరీష్ తదితర శాఖల ఆధ్వార్యన శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. పశుసంవర్థశాఖ జేడీ వెంకటనారాయణ, జిల్లా ప్రణాళికాధికారి శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment