
పరుపుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
● విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు ● రూ.30 లక్షల మేర ఆస్తినష్టం
తల్లాడ: తల్లాడలోని ఓ పరుపుల ఫ్యాక్టరీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మల్లారం రోడ్డులో ఉన్న ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా సుమారు రూ.30 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తల్లాడలో ఐదేళ్ల క్రితం పస్తం రంగారావు, ఆయన కుమారుడు పస్తం మద్దిరామయ్య పేరిట పరుపుల ఫ్యాక్టరీ ఏర్పాటుచేశాడు. ఇక్కడ తయారుచేసే పరుపులను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుంటారు. కాగా, ఫ్యాక్టరీలో గురువారం విద్యుత్ షార్ట్ సర్యూట్ జరిగినట్లు తెలుస్తుండగా మొదలైన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. పరుపులు, పరుపుల తయారీకీ కావాల్సిన సామగ్రికి మంటలు అంటుకునే స్వభావం ఉండడంతో మంటలు ఎగిసిపడగా తయారుచేసిన పరుపులు, ముడి సరుకు, మిషనరీ, వ్యాన్ కాలిపోయాయి. కాగా, మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు బేంబెలెత్తిపోయారు. వైరా అగ్ని మాపక కేంద్రం నుంచి వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే రూ.30లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని యజమాని మద్ది రామయ్య తెలిపారు. కాగా, తల్లాడ పోలీసులు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

పరుపుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment