100శాతం పన్నుల వసూళ్లపై దృష్టి
బోనకల్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఈనెల 20 నాటికి 100 శాతం ఇంటి పన్నులు పూర్తిచేయడమే కాక షాపుల యజమానులతో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆదేశించారు. బోనకల్ మండల పరిషత్ కార్యాలయంలో చింతకాని, బోనకల్ మండలాల కార్యదర్శులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రత నేపథ్యాన అన్ని జీపీల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు నీటి కొరత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని తెలిపారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment