ఖమ్మంసహకారనగర్: కామన్ సర్వీస్ సెంటర్ల(సీఎస్‌సీ) ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ తెలిపారు. సెంటర్ల నిర్వాహకులకు కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, డిజిటల్ సేవలు మెరుగుపరచడానికి సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలోని పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం అమలు చేస్తుండగా ఖమ్మం జిల్లా కూడా ఉందని తెలిపారు. ఇప్పటికే 589 జీపీల్లో 434సెంటర్లు ఏర్పాటుచేయగా, మిగిలిన చోట్ల ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలతో ఏర్పాటుకు ప్రణాళిక ఉందన్నారు. అనంతరం డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఎస్‌పీవీ అండ్ హెడ్ జీ2సీ బాధ్యులు డాక్టర్ విఘ్నేష్ స్వర్ణమోహన్ మాట్లాడగా పలు సెంటర్ల నిర్వాహకులను సన్మానించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎస్‌బీఐ ఆర్‌ఎం లింగస్వామి, ఎల్‌డీఎం శ్రీనివాసరెడ్డి, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, సునీల్‌రెడ్డి, సుహాసిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment