ఖమ్మంలీగల్: ఖమ్మం న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ స్థాయి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కేసుల పరిష్కా రం కోసం తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.
రీజియన్‌లో మహిళా
సంఘాలకు ఏడు బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ అద్దెకు తీసుకునే బస్సులను మహిళా సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తొలిదశలో కొన్ని బస్సులను మహిళా దినోత్సవమైన శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన రీజి యన్లలో ఖమ్మం కూడా ఉండగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలకు రెండు చొప్పున, ఇల్లెందుకు ఒక బస్సు కేటాయించారు. ప్రభుత్వ గ్యారంటీతో మహిళా సంఘాలకు లింకేజీ రుణాలు మంజూరు చేసి, ఈ రుణాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు.
ఇంటర్ పరీక్షకు
570మంది గైర్హాజరు
ఖమ్మం సహకారనగర్/ఏన్కూరు: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం రెండో పరీక్ష శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని 72కేంద్రాల్లో పరీక్ష జరగగా, 18,220మంది విద్యార్థులకు గాను 570మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. కాగా, ఏన్కూరులో రెండు పరీక్షా కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అధికారులు సింహాచలం, శ్రీనివాసరెడ్డి, సుందరం పాల్గొన్నారు.
కాలేజీ భవన నిర్మాణానికి రూ.5.50 కోట్లు
కూసుమంచి: కూసుమంచికి ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కాగా రెవెన్యూ అకాడమీ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈమేరకు భవన నిర్మాణానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణానికి రూ.5కోట్లు, ల్యాబ్ పరికరాలు, కంప్యూటర్ల కొనుగోలుకు మరో రూ.50లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎన్జీవోస్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్
ఖమ్మం సహకారనగర్: ‘తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల అధికారి అవధానుల శ్రీనివాస్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3,424 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 10, 11, 12వ తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే, 13న స్క్రూటినీ, 15వ తేదీన నామినేషన్ల విత్ డ్రా పూర్తయ్యాక 21వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడుగురు సభ్యులను ఎన్నికయ్యాక వీరి నుంచి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఇతర పదవులకు ఎన్నుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment