
●మనల్ని మనం నమ్మాలి..
● చిన్న ఓటమికే కుంగిపోవద్దు ● కుటుంబ న్యాయస్థానం జడ్జి అర్చనాకుమారి
ఓటమితోనే లోపాలు తెలుస్తాయి..
ప్రతీ మహిళ అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే కుంగిపోవద్దు. ఓటమితోనే మనలోని లోపాలను గుర్తించగలుగుతాం. తప్పిదం మన వల్ల జరిగిందా.. సహజంగా జరిగిందా అనే విషయాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే కొత్త పాఠాలు నేర్చుకోగలుగుతాం. లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాక అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. మహిళలు జీవితంలో ఎదగాలన్నా.. రాణించాలన్నా ముందు యాక్సెప్టెన్సీ, ఆ తర్వాత ప్రణాళిక చాలా ముఖ్యం.
రేపటి గురించి ఆలోచన వద్దు..
రేపు ఏం జరుగుతుందో అనే ఆలోచన మనసులోంచి తీసేయాలి. వాస్తవంగా ఏం చేస్తున్నామో ముఖ్యమని గుర్తించి ప్రతీ మహిళ వాస్తవంలో జీవించాలి. పోల్చుకోవడం తప్పేం కాకున్నా విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి. ఎవరి నుంచి అయినా చెడు ప్రభావం పడుతున్నా.. వారిని చూసి అలాంటివి చేయకూడదనేది నేర్చుకోవాలి. మాట సాయంతో, ఇతరత్రా సాయం చేసే వారిని చూసి అలా ఉండాలనే ఆలోచనలు మనకు రావాలి. విజ్ఞానాన్ని పంచే వారితో మాట్లాడుతుండాలి.
నేను ఎదగాలని కోరుకుంది వారే...
నాకు ఇన్‌స్పిరేషన్ అంటే మా అమ్మ, అత్తతో పాటు మా అమ్మమ్మ, నానమ్మను గుర్తు చేసుకుంటాం. వారు చదువుకున్న దాఖలాలు లేవు. అయినా మంచి విషయాలు చెబుతుండేవారు. ఎప్పుడూ నేను పెద్ద స్థాయికి రావాలని కలలు కన్నారు. నేను కొన్నిసార్లు అవుతుందో.. లేదో.. అని అనుకున్నప్పుడు నాకు తోడుగా నిలిచారు. మనకు కష్టం వచ్చిన సమయంలో ఎవరో ఒకరు మన పక్కన ఉంటారు. దానిని మనం గుర్తించాలి.
‘మహిళలు తమని తాము గుర్తించాలి. తమను తాముగా అంగీకరించగలగాలి. చిన్న ఓటమి ఎదురైనా కుంగిపోకుండా ముందుకు వెళ్లాలి. రేపు ఏం జరుగుతుందని కాకుండా.. వాస్తవ పరిస్థితులను అర్థం
చేసుకోవాలి.. నేను ఈ స్థాయికి రావడంలో అమ్మమ్మ, నానమ్మతో పాటు అమ్మ, అత్త పాత్ర ఎంతో ఉంది.’ అని ఫ్యామిలీ
కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చనాకుమారి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని
పురస్కరించుకుని జిల్లా అదనపు
న్యాయమూర్తి ఉమాదేవితో కలిసి ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన ఆమె
వెల్లడించిన అంశాలు అర్చనాకుమారి మాటల్లోనే...
Comments
Please login to add a commentAdd a comment