
కిష్టారంలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
సత్తుపల్లి: సింగరేణి సైలోబంకర్ కాలుష్యం ప్రాణాలు హరిస్తోందంటూ నెల రోజులుగా కిష్టారం గ్రామస్తులు ఓ వైపు ఆందోళనలు చేస్తుండగా.. ఆదివారం కిష్టారం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. కాలనీకి చెందిన రామాల బుచ్చిబాబు (39) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య రాణి, ఇద్దరు కుమార్తెలున్నారు. కేవలం సింగరేణి సైలో బంకర్ విడుదల చేసే కాలుష్యంతోనే గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని కిష్టారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో చోరీల నిందితులు
వైరా: వైరా పోలీసుల అదుపులో అంతరాష్ట్ర చోరీల ముఠా సభ్యులు ఉన్నట్లు సమాచారం. వైరాలో గతనెల 12వ తేదీన లీలాసుందరయ్యనగర్‌లో వృద్ధురాలు శీలం వెంకట్రావమ్మ ఇంట్లోకి సర్వే పేరుతో వచ్చి వివరాలు సేకరించినట్లు నటించి కాళ్లు, చేతులు కట్టి బీరువాలో ఉన్న 18 తులాల బంగారం చోరీ చేశారు. సీపీ సునీల్‌దత్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ ఎంఏ రెహమాన్ ఆధ్వర్యంలో సీఐ నునావత్ సాగర్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఖమ్మం, సూర్యాపేట జిల్లా, ఏపీ ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. నలుగురు వ్యక్తులు, కారు ఫొటోలను విడుదల చేశారు. తర్వాత ఏపీలోని గుంటూరు జిల్లాలో గాలించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు తమిళనాడుకు చెందిన వారిగా మరో ఇద్దరు ఏపీకి చెందిన వారీగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వారిపై ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో హత్య, దోపిడీ, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం.
పేకాటస్థావరంపై దాడి
ఖమ్మంఅర్బన్: నగరంలోని ఎన్నెస్పీ కాల్వ కట్ట శ్రీలక్ష్మినగర్ సమీపంలోని ఖాళీస్థలంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,090 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ భానుప్రకాష్ తెలిపారు.
టైలర్‌పై దాడి
రఘునాథపాలెం: మండలంలోని కోయచలకలో బెల్ట్‌షాపు పక్కన టైలరింగ్ చేస్తున్న అయోధ్యపై మద్యం మత్తులో ఆరెంపుల వీరబాబు దాడి చేసి గాయపరిచాడు. ఆదివారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
సైలోబంకరే కారణ మని కుటుంబసభ్యుల ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment