
దద్దరిల్లుతున్న బాంబుల మోత
ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల శివారు ఇరవై ఎకరాల భూమిలో కొందరు అనుమతి లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్నారు. జనావాసాల నడుమ.. రాత్రింబవళ్లు బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో బండలను పేలుస్తుండగా రాళ్లు ఎగిరి పడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బండరాళ్లను పేల్చడానికి తోడు భూమిని చదును చేసేందుకు ఇప్పటికే వందకు పైగా తాటిచెట్లను నేలమట్టం చేయగా తాము జీవనాధారం కోల్పోతున్నామని గీతకార్మికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా బ్లాస్టింగ్ చేసి, తాటిచెట్లను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై రూరల్ సీఐ రాజును వివరణ కోరగా.. బ్లాస్టింగ్‌కు సంబంధించి ఎవరూ అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాస్టింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆరెంపుల వాసుల ఆందోళన..

దద్దరిల్లుతున్న బాంబుల మోత
Comments
Please login to add a commentAdd a comment