ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకసారి అందిన దరఖాస్తు రెండో సారి రాకుండా పరిష్కరించాలని, అలా సాధ్యం కాకపోతే కారణాలను వివరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
●ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి చెందిన పెందుర్తి కృష్ణవేణి కుమారుడు శ్యాంప్రసాద్ మృతి చెందిన నాలుగేళ్లకు ఆమె కూడా కన్నుమూసింది. దీంతో శ్యాంప్రసాద్ కుటుంబీకులు తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా ఐదెకరాల భూమిని బదలాయించుకున్నారని కృష్ణవేణి కుమార్తెలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
●సింగరేణి మండలానికి చెందిన సయ్యద్ చాంద్ పాషా సర్వే నంబర్ 161లోని పట్టా భూమిలో 1981 నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నందున స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.
●జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా ఎన్నెస్పీ నీటిని ఏప్రిల్ చివరి వరకు విడుదల చేయాలని, సన్నధాన్యం అమ్మిన రైతులందరికీ బోనస్ జమ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు బండి కృష్ణారెడ్డి, మందనపు రామారావు, మల్లెంపాటి రమేష్, పగడవరపు శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ
ఇద్దరం దివ్యాంగులమే...
దివ్యాంగులమైన మా ఇద్దరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మొదటి జాబితాలో పేరు రాలేదు. ప్రత్యేక చొరవ తీసుకుని మాకు ఇల్లు మంజూరు చేయించాలి.
– నాగమణి – నాగేశ్వరరావు, చిన్నగోపతి
కుమారుడే ఇబ్బంది పెడుతున్నాడు
బ్యాంక్ రుణం తీర్చేందుకు ఇంటి స్థలాన్ని విక్రయించాలని యత్నిస్తే పెద్ద కుమారుడు అడ్డుకుంటున్నాడు. స్థానికంగా అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదు. నా సమస్యపై కలెక్టర్ సారే స్పందించాలి. – దంతాల భూదెమ్మ, రేపల్లెవాడ
ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment