ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దు..
● సమన్వయంతో చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి: నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా కార్యాచరణ సిద్ధంచేశామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూనే ఒక్కో హామీ అమలుచేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పలు చోట్ల రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న నేపథ్యాన ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా సాగునీటి సరఫరాకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యం అమ్మిన రైతులందరికీ వారంలోగా బోనస్ జమ చేస్తామని, ఈ నెలాఖరులోపు రైతు భరోసా నిధులు అందిస్తామని తెలిపారు. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు వెన్నపూసల సీతారాములు, బాలాజీ, నాయకులు శాఖమూరి రమేష్, భద్రయ్య, గుండా బ్రహ్మం, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వైరాకు కోటా కంటే ఎక్కువ ఇళ్లు
వైరా: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండగా, వైరాలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ వినతితో మరిన్ని ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య, గోసు మధు, సీతారాములు, నర్సిరెడ్డి, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రిటైనింగ్ వాల్ పనుల్లో వేగం పెంచాలి
ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా రూ.690కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనుల్లో వేగం పెంచాలని, ఇందుకు అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి జలవనరులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇచ్చేలా నివేదిక సమర్పిస్తే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అంతేకాక ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ నర్సింహారావు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈలు ఉదయ్‌ప్రతాప్, రమేష్‌రెడ్డి, మన్మధరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment