హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రుణమాఫీ పూర్తిచేసి రైతుభరోసా ఇస్తుండగా సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఈ బడ్జెట్‌లోనూ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది.
– పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి
జిల్లా సస్యశ్యామలమే లక్ష్యం
‘సీతారామ’ ప్రాజెక్టు పూర్తితో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం. ఖమ్మంలో అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నా. నగరం మొత్తం యూజీడీ కోసం రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించా.
– తుమ్మల నాగేశ్వరరావు,
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
సైలో బంకర్ సమస్యను ప్రస్తావిస్తా..
అంబేద్కర్‌నగర్, బీసీ కాలనీవాసులు సైలో బంకర్‌తో పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. సీతారామ ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు నిధులు కోరతా. గంగదేవిపాడు, తాళ్లపెంట రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్‌డ్యామ్‌లకు నిధులు కేటాయించాలని విన్నవిస్తా.
– డాక్టర్ మట్టా రాగమయి, ఎమ్మెల్యే, సత్తుపల్లి
కళాశాలలు రావాలి..
నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ, పీజీ కళాశాలలు మంజూరు చేయాలని నివేదిస్తా. కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో సాగర్ కాల్వలపై లిఫ్ట్‌ల నిర్మాణం ఆవశ్యకతను కూడా ప్రస్తావిస్తా. పర్యాటక కేంద్రంగా వైరా రిజర్వాయర్ అభివృద్ధి నిధులు కోరతాను.
– మాలోత్ రాందాస్‌నాయక్, ఎమ్మెల్యే, వైరా
హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
Comments
Please login to add a commentAdd a comment