మహిళలు స్వయంశక్తితో ఎదగాలి
వైరారూరల్: మహిళలు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయంశక్తితో ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆయన మంగళవారం వైరా మండలం పుణ్యపురం పర్యటన ముగించుకుని నుంచి ఖమ్మం వెళ్తుండగా కేజీ సిరిపురంలో గ్రామ మహిళా సమాఖ్య సమావేశం జరుగుతోందని తెలిసి హాజరయ్యారు. గ్రామ పరిస్థితి, తాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ, వైద్యులు, గ్రామ కార్యదర్శి పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధిస్తే వారి కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈమేరకు ఇందిరా మహిళా శక్తి ద్వారా సీ్త్ర టీ స్టాళ్లు, మిల్క్ పార్లర్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఏ వ్యాపారం ఎంచుకున్నా శిక్షణ ఇప్పించాక ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆ తర్వాత కూడా అధికారులు తోడుగా నిలుస్తారని కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ నూరొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment