బీసీ యువతకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
● తూనికలు, కొలతలతో పాటు నాణ్యతలోనూ నగుబాటే ● తనిఖీల మాటే మరిచిన శాఖ ఉద్యోగులు ● ఫలితంగా కొనసాగుతున్న వ్యాపారుల మోసాలు
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
ఖమ్మంక్రైం: నిత్యం ఏదో ఒక వస్తువు కొనడం తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓ చోట మోసం సహజమైపోయింది. వీధివ్యాపారులు మొదలు బడా స్టోర్లలోనూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇనుప కాంటాల్లోనే కాదు ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం రీడింగ్ తగ్గించి తక్కువ తూకంతో సరుకులు అంటగడుతున్నారు.
తనిఖీల మాటే లేదు...
జిల్లాలో ఉన్న తూనికలు, కొలతల శాఖ(లీగల్ మెట్రాలజీ) పూర్తిగా నిర్వీర్యమైందనే చెప్పాలి. అరకొర దాడులతో ఏళ్ల తరబడి నెట్టుకొస్తుండడంతో వ్యాపారులకు భయం లేకుండా పోయింది. చాలామంది వ్యాపారులకు తూనికల కొలతల శాఖ ఉందని తెలియదంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సిబ్బంది తనిఖీలకు వచ్చినా పెద్దగా జరిమానా లేకపోవడంతో కడతామని.. లేదా సిబ్బందికే డబ్బులు ఇస్తే వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఫలితంగా తూకం రాళ్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను ఏటా బరువు నిర్ధారించి సీల్ వేయించుకోవాల్సిన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
నలుగురే సిబ్బంది
గతంలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో కొనసాగిన తూనికలు, కొలతల శాఖ కార్యాలయాన్ని ఇప్పుడు కలెక్టరేట్‌కు మార్చారు. అయితే, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎన్ని పోస్టులో ఇప్పుడూ అవే కొనసాగుతున్నాయి. కాగా, ఆరుగురు ఉద్యోగులకు గాను నలుగురు పనిచేస్తుండగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అలాగే, మహబూబాద్ జిల్లా తూనికల కొలతల శాఖాధికారే ఇక్కడా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండడంతో అజమాయిషీ కరువైందని చెబుతున్నారు.
కొన్ని కేసులు.. కొంత జరిమానా
తూనికల, కొలతల శాఖ ఆధ్వర్యాన జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తూకం రాళ్లు, ఎలక్ట్రానిక్ కాంటాలపై ముద్రలు వేయడం, లైసెన్స్‌ల జారీకి రూ.34,46,820 వసూలయ్యాయి. అలాగే, అక్రమ కాంటాలు,ప్యాకింగ్‌లు చేస్తున్న వారిపై 37 కేసులు నమోదు చేయగా, రూ.9,26లక్షల జరిమానా జమ అయింది. ఇక ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారిపై 37కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ముద్రల కోసం రూ.8.05లక్షలు, జరిమానా రూ.3.10లక్షలు వసూలయ్యాయి. అలాగే, కాంటాలకు సంబంధించి పది కేసులు, ప్యాకింగ్‌లో అవకతవకలపై జరిమానాగా రూ.3లక్షల మేర వసూలు చేశామని జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్‌చార్జ్ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. వినియోగదారులు ఎక్కడైనా మోసపోయినట్లు గ్రహిస్తే తమ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ద్వారా నిరుద్యోగ బీసీ యువతకు హైదరాబాద్‌లోని హకీంపేటలో ఆర్టీసీ ద్వారా డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. హెచ్‌ఎంవీ(హెవీ మోటర్ వాహనం), ఎల్‌ఎంవీ(తేలికపాటి మోటార్ వాహనం) డ్రైవింగ్‌లో 38 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఆతర్వాత అర్హత సాధించిన వారికి పర్మనెంట్ లైసెన్స్ ఉచితంగా అందిస్తారని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. అలాగే, శిక్షణ సమయంలో ఆర్టీసీ ద్వారా ఉచిత వసతి సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువకులు తమ కార్యాలయంలో ఈనెల 31వ తేదీలోగా సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
2
3
ఖమ్మంమయూరిసెంటర్: ప్రతిదీ లాభాల కోణంలో చూస్తున్న వ్యాపారులు ప్రజారోగ్యాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు. ఖమ్మం కిన్నెరసాని థియేటర్ సమీపాన ఓ హోటల్ ఖార్కానాను పరిశీలించగా.. కనీస నిబంధనలేమీ పాటించకుండా పిండివంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. డ్రెయినేజీపైనే గ్యాస్ స్టౌలు ఏర్పాటుచేయగా, వాడిన నూనెనే మళ్లీ వాడుతుండడం, మిగిలిపోయిన పదార్థాలతో కొత్తవి తయారుచేస్తున్నట్లు కనిపించింది.
ఖమ్మం అర్బన్: చిరువ్యాపారులు కొందరు కళ్ల ముందే మోసం చేస్తున్నారు. ఇది మోసమని కూడా తెలియకపోవడంతో వినియోగదారులకు నష్టం ఎదురవుతోంది. చెరుకు రసం, కొబ్బరినీళ్లు ఇంటికి తీసుకెళ్లే వారు లీటర్, రెండు లీటర్ల చొప్పున బాటిళ్లు ఎంచుకుంటారు. అయితే, ఓ చోట పరిశీలించగా లీటర్ బాటిల్‌గా చెప్పిన సీసాలో 700 ఎం. ఎల్.కు మించి పట్టలేదు.
గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దుస్తులు అమ్మే రామయ్య రోజుకు రెండు లీటర్ల పెట్రోల్ పోయిస్తాడు. ఇదే తరహాలో ఓ రోజు వెళ్తుండగా మధ్యలో వాహనం ఆగిపోయింది. ఏదో సమస్య ఉందని భావించి పరిశీలించినా ఏదీ తేలలేదు. చివరకు ఆ గ్రామ యువకులు పరిశీలించి పెట్రోల్ అయిపోయిందని చెప్పగా ఎండలో మూడు కి.మీ. మేర వాహనం తోస్తూ వచ్చాడు. ఎప్పుడూ వెళ్లే బంక్‌కు కాకుండా ఇంకో బంక్‌కు వెళ్లడంతో పెట్రోల్ తక్కువగా పోసి తనను మోసం చేశారని రామయ్యకు అర్థమైంది.
ఖమ్మంకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి
సుబ్బారావు నెల జీతం రాగానే షాప్‌నకు వెళ్లి కిరాణా సరుకులు తీసుకొచ్చాడు. ఆయన ముందే అన్నింటినీ ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి ప్యాక్ చేశారు. ఇంటికి వచ్చాక ఆయన భార్యకు అనుమానం వచ్చి
సమీపంలోని షాపులో తూకం వేయించగా ఒక్కో ప్యాకెట్‌కు 100నుంచి 150గ్రాముల వరకు తక్కువగా వచ్చింది.
బీసీ యువతకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
బీసీ యువతకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment