భూగర్భ గనులే కీలకం
● సింగరేణిలో 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదుపై దృష్టి ● ఇటీవల రీజియన్లలో పర్యటించిన ఉన్నతాధికారులు ● ‘చైతన్య యాత్ర’ల పేరిట కార్మికులతో మమేకం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త్వరలో ఆర్థిక సంవత్సరం ముగి యనున్నందున కార్మికులు గైర్హాజరు కాకుండా, నెలకు 20 మస్టర్లు తగ్గకుండా పనిచేస్తూ ఆయా గనులు, డిపార్ట్‌మెంట్లకు నిర్దేశించి లక్ష్యాల సాధనకు కృషి చేసిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. అంతేకాక డైరెక్టర్లతో సహా సింగరేణి సీఎండీ బలరామ్ శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం, భూపాలపల్లి, గోదావరిఖని, ఇందారం, న్యూటెక్ తదితర ఏరియాల్లోని భూగర్భ గనుల్లో పర్యటించి ఉత్పత్తిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్పత్తికి ఏమైనా అవాంతరాలు, ఇతరత్రా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. మిగిలిన తక్కువ సమయంలో లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి సాధించాలని, ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేయాలని సూచించారు.
ఇంకా మిగిలే ఉంది..
సింగరేణిలో గత ిఫిబ్రవరి 12వ తేదీ నాటికి 60.41 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 56.41 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించారు. మిగిలిన సమయంలో 15.59 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ఈ ఉత్పత్తి కాస్త పురోగతిలోనే ఉన్నప్పటికీ లక్ష్యం మాత్రం చేరలేదు. ఇప్పటి వరకు భూగర్భ గనుల్లో 52.10 లక్షల టన్నులకు 40.58 లక్షల టన్నులు సాధించగా, ఓపెన్ కాస్ట్ గనుల్లో 55.18 మిలియన్ టన్నులకు 52.34 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది.
ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు భూగర్భగనుల్లో ఉత్పత్తి ఇలా..
ఏరియా గని లక్ష్యం ఉత్పత్తి శాతం
(టన్నుల్లో) (టన్నుల్లో)
కొత్తగూడెం పీవీకే–5 3,02,688 1,32,173 44
మణుగూరు కొండాపురం 2,10,000 1,31,652 72
గోదావరిఖని 1, 3 ఇంకై ్లన్ 2,07,500 1,14,434 55
గోదావరిఖని 2, 2ఏ ఇంకై ్లన్ 2,42,625 1,16,489 48
గోదావరిఖని 11 ఇంకై ్లన్ 7,08,650 5,73,841 81
గోదావరిఖని వకీల్‌పల్లి 3,02,685 3,15,104 104
భూపాలపల్లి కేటీకే–1, 1ఏ 2,16,500 1,56,123 72
భూపాలపల్లి కేటీకే –5 ఇంకై ్లన్ 2,17,000 1,74,238 80
భూపాలపల్లి కేటీకే –6 ఇంకై ్లన్ 1,56,325 1,09,662 70
భూపాలపల్లి కేటీకే –8, 8ఏ 2,43,350 1,59,833 66
అడ్రియాల ఏఎల్‌పీ 3,86,515 3,86,515 100
మందమర్రి కేకే –5 ఇంకై ్లన్ 1,73,000 1,76,912 102
మందమర్రి కాసిపేట 2,08,125 1,26,230 61
మందమర్రి కాసిపేట –2 1,73,000 95,546 55
శ్రీరాంపూర్ ఎస్కే 1,03,750 48,508 47
శ్రీరాంపూర్ ఆర్‌కే–5 ఇంకై ్లన్ 2,34,875 2,11,456 90
శ్రీరాంపూర్ ఆర్‌కే–6 ఇంకై ్లన్ 1,55,625 1,64,724 106
శ్రీరాంపూర్ ఆర్‌కే–7 3,11,250 2,64,343 85
శ్రీరాంపూర్ ఆర్‌కే రాంటెక్ 1,38,375 1,64,724 106
శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ –1 1,03,975 81,019 78
శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ 3, 3ఏ 2,42,625 2,04,888 84 బెల్లంపల్లి ఐకే–1ఏ ఇంకై ్లన్ 2,06,813 1,67,679 81
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
ఈ ఏడాది కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యసాధన 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు బదిలీ వర్కర్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి. గనుల్లో 100 శాతం ఉత్పత్తి సాధనకు సింగరేణి వ్యాప్తంగా భూగర్భ గనుల్లో కార్మిక చైతన్య యాత్రలు నిర్వహించాం. పోటీ ప్రపంచంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించి, ఉత్పత్తికి డిమాండ్ పెరిగేలా చూడాలి. ఉత్పత్తితో పాటు రక్షణకూ ప్రాధాన్యమిస్తూ ప్రమాద రహిత సింగరేణిగా కీర్తి గడించాలి. – ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment