ట్రాఫిక్ ఇక్కట్లు లేని నగరంగా ఖమ్మం
● ప్రజల వినతి మేరకు రోడ్ల విస్తరణ ● తీగల వంతెన పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల
ఖమ్మంఅర్బన్: ప్రజల వినతి మేరకు రోడ్లు విస్తరిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లు లేని నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దే కృషి జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్నేటిపై తీగల వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. బ్రిడ్జి పనులు రెండువైపుల నుంచి చేపడుతూ జూన్‌లోగా పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.39కోట్లు భూసేకరణ పరిహారం చెల్లించనున్నామని తెలిపారు. ఈ బ్రిడ్జి పూర్తయితే ఖమ్మంకు మణిహారంగా మారుతుందన్నారు. కాగా, భూములు, ఆస్తులు కోల్పోయిన వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇక పొన్నెకల్ నుండి ఇల్లెందు క్రాస్ రోడ్డుకు జాతీయ రహదారిని అనుసంధానించేలా రోడ్డు నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ హేమలత, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, వివిధ ఉద్యోగులు, నాయకులు చంద్రశేఖర్, విశ్వనాథ్, రావూరి సైదబాబు, సాధు రమేష్‌రెడ్డి, శరత్, బాలగంగాధర్ తిలక్, తుపాకుల యలగొండస్వామి, పాటిబండ్ల యుగంధర్, క్రాంతిసిన్హా పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో...
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం కాల్వొడ్డులోని మదర్సాలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రషీద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment