ప్రతీ ఇంట్లో పుస్తకాల గది ఉండాలి..
● కట్నం తీసుకోవద్దు.. తీసుకుంటే వెనక్కి ఇవ్వాలి ● స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
నేలకొండపల్లి: ప్రతీ ఇంట్లో పుస్తకాల గది ఏర్పాటుచేసుకోవాలని స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సూచించారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం వద్ద స్వేరోస్ ఆధ్వర్యాన చేపట్టిన భీమ్ దీక్షను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాన్షీరాం జయంతి నుంచి అంబేద్కర్ జయంతి వరకు దీక్ష కొనసాగుతుందని, ఈ దీక్ష నెల మాత్రమే కాకుండా జీవితాంతం చేపట్టాలని పిలుపునిచ్చారు. దీక్షలో భాగంగా కుటుంబమంతా వారానికి కనీసం మూడు రోజులు పుస్తక పఠనం చేయాలని, ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. స్వేరోలు ఏ పని చేసినా ఆ రంగంలో అందరికంటే గొప్పగా రాణించేలా కష్టపడాలని సూచించిన ఆయన అప్పులు చేసి పెళ్లి జరిపించడం కాకుండా తీసుకున్న కట్నం వెనక్కి ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పొందే అవకాశాలు తగ్గుతున్నందున సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జ్ఞానం పెంచుకోవాలని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో స్వేరోస్‌ను అన్ని ఖండాలకూ విస్తరిస్తామన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, జ్ఞాన ఖడ్గధారణ చేయడమే కాక పిల్లల కాళ్లు కడిగారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రతినిధులు వీరయ్య, ప్రవీణ్, బల్గూరి దర్గయ్య, బాలప్రసాద్, రమేష్, సదానందం, పుల్లయ్య, కిషన్, ప్రకాష్, లలిత, శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment