ఘనంగా పసుపు దంచే వేడుక
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(గుట్ట)పై మార్చి 24వ తేదీన జరగనున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం పసుపు దంచే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేశ్‌శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు ఆధ్వర్యంలో సుమారు 800 నుంచి 1000 మంది మహిళలు పసుపుకొట్టి స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ సందర్భంగా స్వామి కల్యాణ విశేషాలను తెలుపుతూ వీడియో టీజర్‌ను వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు దేవినేని రోజారమణి ఆవిష్కరించారు. ఈ నెల 22 జరగనున్న శ్రీనివాస గిరి సంకీర్తన కరపత్రాన్ని కంచర్ల భార్గవ్ – శ్రావ్య, బుగ్గవీటి ఫణీంద్రబాబు – విజయలక్ష్మి దంపతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరుట్ల లక్ష్మణాచార్యులు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కందుకూరి రామకృష్ణ, తాటికొండ శ్రీలత, లక్ష్మిరెడ్డి, వంకదారు నర్సింహకుమార్, బండి వెంకటేశ్వర్లు, కంఠాల వెంకటేశ్వరరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మిట్టపల్లి నర్సింహారావు, పురుషోత్తం, జమ్ముల సీతారామిరెడ్డి, రమేశ్, రాంజీఅంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.
24న శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment