అ‘పూర్వ’ సమ్మేళనం
మధిర: మధిర పట్టణంలో జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ మొదటి బ్యాచ్ 1970–71 చదివిన వారు ఆదివారం కోనస్ వీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఆనాడు చదువుకున్న తీపి గుర్తులును నెమరు వేసుకున్నారు. 72 మందికి గనాఉ 60 మందికిపైగా హాజరయ్యారు.
బస్సు, కారుడ్రైవర్
పరస్పర దాడులు
పాల్వంచరూరల్: బస్సు, కారు ఢీకొనడంతో రెండు వాహనాల డ్రైవర్లు ఒకరిపైఒకరు దాడులు చేసుకున్న ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్దమ్మగుడి వద్ద బీసీయం జాతీయ రహదారిపై భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారుకు రాసుకపోయింది. దీంతో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బదినడంతో కారుడ్రైవర్ నవీన్ బస్సుడ్రైవర్ రమేశ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు డ్రైవర్లు ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ సతీశ్ వెల్లడించారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు
దుమ్ముగూడెం: మండలంలోని జడ్.వీరభద్రారం గ్రామానికి చెందిన కొమరం రాముడు కనిపించకుండా పోయిన ఘటనపై ఎస్‌ఐ వెంకటప్పయ్య ఆదివారం కేసు నమోదు చేశారు. కొమరం రాముడు జడ్.వీరభద్రారం గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. వివాహం అనంతరం అతను కనిపించకపోవడంతో అతని భార్య లక్ష్మీదేవి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment