విద్యుత్ సేవల్లో సాంకేతికత..
యాప్‌లోని అంశాలు ఇలా..
●రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ : ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగినా ఇందులో జీపీఎస్ లొకేషన్ ద్వారా ఫొటో తీసి పంపొచ్చు. తద్వారా సంబంధిత అధికారి పరిశీలించి పరిష్కరించేందుకు వీలవుతుంది.
●కన్జ్యూమర్ గ్రీవెన్సె : న్యూ కంప్లైంట్ : వినియోగదారులకు సంబంధించి సమస్యలను నేరుగా ఇందులో పొందుపర్చవచ్చు. మీటర్ నంబర్, సమస్య వివరాలు నమోదు చేస్తే పరిష్కరిస్తారు.
●కంప్లైంట్ స్టేటస్ : ఫిర్యాదు చేసిన సమస్య స్థితిగతులను ఇందులో చూసుకునే సౌలభ్యం ఉంది.
●రీ ఓపెన్ కంప్లైంట్ : ఫిర్యాదు చేసిన సమస్యపై సంతృప్తి చెందకపోతే మళ్లీ అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
●సెల్ఫ్ రీడింగ్ : ఇందులో వినియోగదారులు సెల్ఫ్ రీడింగ్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. తద్వారా సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండాల్సిన పని ఉండదు.
●పే బిల్స్ : నెలవారీ విద్యుత్ బిల్లులను వినియోగదారుల సర్వీస్ నంబర్ ఆధారంగా చెల్లించవచ్చు. ఇది సులభమే కాక సమయం ఆదా అవుతుంది.
●బిల్ హిస్టరీ : చెల్లించిన విద్యుత్ బిల్లుల వివరాలు తెలుసుకుని నెల వారీగా హెచ్చుతగ్గులను నిర్ధారించుకోవచ్చు.
●ఆన్‌లైన్ పేమెంట్ హిస్టరీ : ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన బిల్లుల తాలూకు సమాచారం ఇందులో ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన బిల్లుల సమాచారం తెలుసుకోవచ్చు.
●కొత్త సర్వీస్ స్థితి : కొత్త సర్వీసుల మంజూరు స్థితిగతులను ఎప్పటికప్పుడు దరఖాస్తు నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
●లింక్ ఆధార్–మొబైల్ : వినియోగదారుల ఆధార్, సెల్‌నంబర్లు లింక్ చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల సమాచారం ఫోన్‌కు అందుతుంది.
●డొమెస్టిక్ బిల్ క్యాలుక్యులేటర్ : వినియోగదారుల నెలవారీ విద్యుత్ వినియోగం, మీటర్ రీడింగ్ వివరాలు ఇందులో పొందుపరిస్తే బిల్లు తాలూకా పూర్తి సమాచారం వస్తుంది.
●కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి : కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి.
●పేరు, లోడ్ మార్పు : విద్యుత్ మీటర్ పేరు మార్పుపై వివరాలు, లోడ్ సమాచారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
●పవర్ కంజమ్షన్ గైడ్‌లైన్స్ : ఏ ఉపకరణాలు ఎంత వాడితే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుస్తుంది.
●టారిఫ్ డిటైల్స్ : విద్యుత్ వినియోగం, చార్జీల వివరాలు కేటగిరీల వారీగా ఇందులో సవివరంగా ఉంటాయి. గృహవినియోగదారులు, గృహేతర విని యోగదారులు, పరిశ్రమల తదితరాల వివరాలు కేటగిరీల వారీగా చార్జీల వివరాలు పొందుపర్చబడి ఉంటాయి.
●ఎనర్జీ సేవింగ్ టిప్స్ : ఇందులో విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నపుడు పొదుపు కోసం ఆచరించాల్సిన సూచనలు ఉంటాయి.
●సేఫ్టీ టిప్స్ : విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడుతుంది.
●ఫీడ్‌బ్యాక్ : విద్యుత్ సేవల పట్ల వినియోగదారుల అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. తద్వారా మెరుగైన సేవలను పొందే అవకాశం ఉంటుంది.
●మై అకౌంట్ : మై అకౌంట్‌లో వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయి. మీటర్ తాలూకు వివరాలు, తదితర సమాచారం దీనిలో ఉంటుంది.
●బిల్లు సమాచారం : వినియోగదారుల బిల్లులకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుంది. వినియోగదారుల సర్వీస్ నంబర్ నమోదుచేసి బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు.
●అధికారి వివరాలు : వినియోగదారుల పరిధిలోని అధికారిని సంప్రదించాలంటే ఇందులో నుంచి తెలుసుకోవచ్చు. ఎటువంటి సందేహాలు ఉన్నా సంబందిత అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
●కాంటాక్ట్ అజ్ : దీనిలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్లు 18004250028, 1912.
20 అంశాలతో
టీజీ ఎన్పీడీసీఎల్ యాప్
ఘటనలు, ఫిర్యాదులు నమోదు చేసేలా రూపకల్పన
ఇటు వినియోగదారులకు లబ్ధి..
ఉద్యోగుల్లో జవాబుదారీ తనం
వినియోగదారులతో పాటు విద్యుత్ శాఖకు సౌకర్యవంతంగా ఉండేలా టీజీ ఎన్పీడీసీఎల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా 20 అంశాలతో కూడిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. వినియోగదారులు తమ ఫోన్ నుంచే సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తోంది. వివిధ ఫిర్యాదులు, బిల్లులు, నూతన సర్వీసులు, మీటర్ పేరు మార్పిడి తదితర అంశాలను ఈ యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. వినియోగదారులకు ఈ యాప్‌తో మేలు జరగడమే కాక నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులకూ ఉపయోగపడుతోంది. అంతేకాక ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు. – ఖమ్మంవ్యవసాయం
యాప్ సేవలు ప్రయోజనకరం
వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో టీజీఎన్పీడీసీఎల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తద్వారా సంస్థ సమాచారం తెలుసుకోవడమే కాక మెరుగైన సేవలు పొందొచ్చు. ఈ యాప్ సేవలు అటు వినియోగదారులకే కాక సంస్థకు సైతం ప్రయోజనకరం.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఖమ్మం సర్కిల్
విద్యుత్ సేవల్లో సాంకేతికత..
విద్యుత్ సేవల్లో సాంకేతికత..
Comments
Please login to add a commentAdd a comment