రెండు కళ్లలా అభివృద్ధి, సంక్షేమం
● ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పెనుబల్లి/కల్లూరు రూరల్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలుచేస్తూనే అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో గురువారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.87 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో శంకుస్థాపన చేశారు. అలాగే, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పెద్దకోరుకొండిలో ఎస్సీ కమ్యూనిటీహాల్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, రైతుల రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, సన్న ధాన్యానికి బోనస్ అమలుచేశామని చెప్పారు. ఉగాది పండుగ నుండి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు. కాగా, యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో 5వేల మందికి తగ్గకుండా రూ.4 లక్షల మేర సబ్సిడీ రుణాలు ఇస్తామని, రానున్న నాలుగేళ్లలో 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకు ప్రత్యేకంగా సీ్త్ర టీ క్యాంటీన్లు మంజూరు చేశామని, త్వరలోనే రెండు పెట్రోల్ బంక్‌లు ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, పెనుబల్లి మండలం రామచంద్రాపురం పర్యటనలో భాగంగా స్థానికులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం రామచంద్రాపురం, ఏరుగట్లలో సమస్యలను విన్నవించారు. ఏళ్లుగా పోడు చేసుకుంటున్న భూముల నుంచి అటవీ అధికారులు ఖాళీ చేయించారని ఫిర్యాదు చేయగా , 20–25 రోజుల్లో సమస్య పరిష్కరించాలని కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్, ఆర్డీవో రాజేంద్ర గౌడ్, అటవీ అధికా రులను మంత్రి ఆదేశించారు. అలాగే, సీతారామ ప్రాజెక్టు కాల్వ యాతాలకుంట నుండి కి.మీ. మేర పొడిగిస్తే సాగు నీరు అందుతుందని చెప్పగా నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. అంతేకాక మరో ఆరుగురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సర్వే చేయాలని తెలిపారు. ఈకార్యక్రమాల్లో రాష్ట్ర ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, కల్లూరు ఆర్డీఓ ఎల్.రాజేందర్, తహసీల్దార్ల గంటా ప్రతాప్, పులి సాంబశివుడు, ఎంపీడీఓలు అన్నపూర్ణ, దాసరి చంద్రశేఖర్, కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవితో పాటు నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కీసర శ్రీనివాసరెడ్డి, సోమరాజు సీతారామారావు, పి.వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, గూడూరు మాధవరెడ్డి, దొంతు మాధవరావు, ఈడీ కమలాకర్‌రావు, పోతురాజు కిషోర్, పిల్లి నవజీవన్, కరీముల్లా, రాజబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంవన్‌టౌన్: ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment