మరొకరి పార్సిల్ తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు
చింతకాని: ఓ వ్యక్తికి వచ్చిన రిజిస్టర్ పార్సిల్‌ను మరో వ్యక్తి తీసుకెళ్లగా పోలీసులు కేసు నమోదు చేశారు. చింతకాని మండలం మత్కేపల్లి గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ గడ్డం బాలాజీ అనంతసాగర్ గ్రామానికి జనవరి నుంచి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గతనెల 12వ తేదీన అనంతసాగర్‌కు చెందిన వడ్లమూడి సత్యనారాయణ పేరిట రిజిస్టర్ పోస్ట్ రాగా వడ్లమూడి నాగేశ్వరరావు తానే సత్యనారాయణ అని చెప్పి తీసుకెళ్లాడు. ఆతర్వాత సత్యనారాయణ భార్య సుభద్ర ఆరాతీయగా అప్పటికే తీసుకెళ్లినట్లు చెప్పడంతో సంతకం, ఫోన్ నంబర్‌ను ఆదారంగా వడ్లమూడి నాగేశ్వరరావుగా గుర్తించారు. ఈమేరకు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
రీజియన్‌ను అగ్రగామిగా నిలిపారు...
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో విధులు నిర్వర్తించిన ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) జీ.ఎన్.పవిత్ర, డిప్యూటీ రీజినల్ మేనేజర్(మెకానికల్) ఎస్.భవానీప్రసాద్‌ను రీజియన్‌ను అగ్రగామిగా నిలిపారని రీజినల్ మేనేజర్ ఏ.సరిరాం కొనియాడారు. బదిలీపై వెళ్తున్న పవిత్ర, భవానీప్రసాద్‌ను ఖమ్మం ఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం సన్మానించారు. ఈసందర్భంగా సరిరాం మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. అనంతరం షాద్‌నగర్, మహబూబ్‌నగర్ రీజియన్లకు పవిత్ర, భవానీప్రసాద్‌ను ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల మేనేజర్లు, వివిధ విభాగాల ఉద్యోగులు సన్మానించారు.
జీవిత అనుభవాల్ని తెలిపేదే కథ..
ఖమ్మం సహకారనగర్: కథ అంటే జీవిత అనుభవాల్ని తెలపడమే కాక సందేశాన్ని ఇస్తుందని కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కళాశాల తెలుగు విభాగం, ఐక్యూఏసీ విభాగాల ఆధ్వర్యాన బుధవారం ‘కథలోకి..’ పేరిట నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కథలు రాసే విధానంపై తన అనుభవాలను వివరించగా, ప్రముఖ కథా రచయిత నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ తదితరులు మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పి.రవికుమార్, ఎం.సునంద, డాక్టర్ సీతారాంతో పాటు ప్రసేన్, రవిమారుత్, ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ బానోత్ రెడ్డి, డాక్టర్ జె.అనురాధ, డాక్టర్ కిరణ్, కోటమ్మ, ఎం.వీ.రమణ, కార్తీక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరొకరి పార్సిల్ తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment