
కేసీఆర్‌ను కలిసిన పువ్వాడ కుటుంబం
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుటుంబ సమేతంగా శనివారం కలిశారు. పువ్వాడ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట ఆయన సతీమణి వసంతలక్ష్మి, తనయుడు, కోడలు ఉన్నారు. అలాగే, ఉదయం ఖమ్మంలో తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సమక్షాన పువ్వాడ అజయ్ కేక్ కట్ చేయగా, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ ప్రజలనే కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సమక్షాన పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాగా, పువ్వాడ అజయ్‌కు బీఆర్‌ఎస్ నాయకులు గొల్లపూడి హరికృష్ణ, మోరంపూడి సాయికృష్ణ, కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఇంకా బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు గుండాల కృష్ణ, కర్నాటి కృష్ణ, మక్బూల్, వీరూనాయక్, ఖమర్, తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు, మాటేటి కిరణ్, మున్నా, చంటి, చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బొమ్మ రాజేశ్వరరావు, మల్లాది వాసుదేవరావు, సాంబశివరావు, రామారావు, అప్జల్‌హాసన్, కొల్లు పద్మ, షకీనా వేడుకల్లో పాల్గొన్నారు. దేవభక్తుని కిషోర్‌బాబు ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించగా, రఘునాథపాలెంలోనూ పువ్వాడ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

కేసీఆర్‌ను కలిసిన పువ్వాడ కుటుంబం