
ఇంటర్ ఫలితాలు ౖపైపెకి..
గతంతో పోలిస్తే పెరిగిన జిల్లా ఉత్తీర్ణత శాతం●
● ప్రథమ సంవత్సరంలో 71.15, సెకండియర్‌లో 77.69శాతం ఉత్తీర్ణత ● రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పలువురు ● ఎప్పటిలాగే సత్తా చాటిన బాలికలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఫలితాలను విడుదల చేయగా.. మొదటి సంవత్సరంలో జిల్లాకు మూడో స్థానం, ద్వితీయ సంవత్సరంలో ఐదో స్థానం లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడమే కాక జిల్లా విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించడం విశేషం. – ఖమ్మంసహకారనగర్
ఫలితాలు ఇలా...
ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరైన 15,584మందిలో 11,088మంది ఉత్తీర్ణత సాధించగా 71.15శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,876 మంది పరీక్షలు రాయగా 11,557 మంది ఉత్తీర్ణతతో 77.69 శాతం ఫలితాలు వచ్చాయి. ఒకేషనల్ విభాగం ప్రథమ సంవత్సరంలో 2,253 మందికి 1,388 మంది(61.61 శాతం), ద్వితీయ సంవత్సరంలో 2,043 మందికి 1,439 మంది(70.44శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం దక్కగా ఈసారి మూడో స్థానానికి ఎగబాకింది. ఇక ద్వితీయ సంవత్సరంలో మాత్రం గత ఏడాది మాదిరిగా ఐదో స్థానమే దక్కింది.
బాలికలదే హవా
ప్రథమ సంవత్సరం పరీక్షలకు బాలురు 7,851 మంది హాజరుకాగా 5,065 మంది(64.51శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,733మందికి గాను 6,023మంది(77.89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో బాలురు 7,346 మందికి 5,297 మంది(72.10శాతం), బాలికలు 7,530మందికి గాను 6,260 మంది(83.13శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది.
ప్రైవేట్ కళాశాలల హవా
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అత్యధికంగా 994, 992తో పాటు 980కిపైగా మార్కులు పలువురు విద్యార్థులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 468మార్కులు పలువురు విద్యార్థులు సాధించటం విశేషం. బైపీసీ, ఇతర గ్రూపుల్లోనే ఇదే పరిస్థితి కనిపించింది.
పెరిగిన ఉత్తీర్ణత శాతం
ఈ ఏడాది మొత్తంగా చూస్తే ఫలితాలు మెరుగయ్యాయనే చెప్పాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈ ఏడాది 3 – 8శాతం మేర పెరిగింది. అంతేకాక ఎక్కువ మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగవడంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు లభించినట్లయింది.
ప్రథమ సంవత్సరం ఫలితాలు
సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు శాతం
2020 15,558 10,383 66
2022 14,274 9,869 69
2023 15,450 10,456 67
2024 16,015 10,224 63.84
2025 15,584 11,088 71.15
ద్వితీయ సంవత్సరం ఫలితాలు
సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు శాతం
2020 15,549 10,666 68
2022 14,366 10,297 71
2023 13,339 9,964 74
2024 14,564 10,806 74.20
2025 14,876 11,557 77.69
30లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 30వ తేదీలోగా ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. రీ వెరిఫికేషన్ కోసం ప్రతీ పేపర్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కై తే పేపర్‌కు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. tg. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మార్కులు తక్కువగా వచ్చిన, ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీకి సిద్ధం కావాలని సూచించారు.

ఇంటర్ ఫలితాలు ౖపైపెకి..