
మంత్రి తుమ్మలను కలిసిన జేఏసీ బాధ్యులు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా బాధ్యులు బుధవారం త్రి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మంలో కలిశారు. ఈసందర్భంగా పలు సమస్యలను వివరించి పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. జేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణతో పాటు పారుపల్లి నాగేశ్వరావు, ఎస్.విజయ్, నాగేశ్వరరావు, వెంగళరావు, రంజాన్, వెంకటేశ్వర్లు, బిక్కు, సుబ్బయ్య , కొణిదన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, వల్లపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.